అభిమానం అనేది వెలకట్టలేనిది అని మన సినీ తారలు వీలు చిక్కినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. అది నిజమే అన్నట్టుగా కొన్ని సంఘటనలు కూడా జరుగుతుంటాయి బయట. ఈ సంవత్సరం భారీ అంచనాలతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రభస సినిమా ఇప్పుడు మళ్ళీ విడుదల అవుతుంది. అయితే ఒక్క థియేటర్ లో మాత్రమే.
ఎన్టీఆర్ అభిమానులు తన అభిమాన నటుడు చిత్రాన్ని ఒక్క రోజు షో వేసి దాని ద్వారా వచ్చిన డబ్బులను విశాఖ నగరాన్ని కుదిపేసిన హుదూద్ తుఫాన్ బాధితులకు ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇది కేవలం ఎన్టీఆర్ అభిమానుల చేతుల మీద జరుగుతున్నది కాదు. తెలుగు దేశం కార్యకర్తలు కూడా ఈ ఆలోచనలో భాగం గా ఉన్నారట. హుదూద్ బాధితుల కోసం చేస్తున్న ఈ షో తమిళనాడు లో జరగడం మరో విశేషం. ఈ నెల 9వ తారీఖున వేస్తున్న ఈ షో ద్వారా వచ్చే నగదును సి.ఎం రిలీఫ్ ఫండ్ కు ఇవనున్నారు షో నిర్వాహకులు.
newtelugunews
Post a Comment