అసలే శీతాకాలం.. సూర్యుడు కూడా చాలా బద్ధకంగా నిద్రలేచే రోజులు.. వలస వచ్చిన పక్షుల కిలకిలలు.. మంచు బిందువుల పరామర్శలు.. తాజాగా వికసిస్తున్న పూరేకుల సోయగాలు.. ఇలా ఏ పక్క చూసినా ప్రకృతి అత్యంత సౌందర్యంగా కనిపిస్తుంది. ఇక ఇలాంటి సమయాలలో హిల్ స్టేషన్ ల అందాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ఒక ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన జోడి శృతిహాసన్ తో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు.
ఇక మ్యాటర్ లో కి వస్తే మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీకి సై అన్న విషయం తెలిసినదే. ఈ మధ్యే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ అవుట్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. పూణే 'లవాసా' అనే హిల్ స్టేషన్ ని ఈ ప్రక్రియలో ఎంచుకుంది. అక్కడి రోడ్లు హీరోయిన్ నడుములా ఒంపులు తిరుగుతుంది. అక్కడి ఆకాశం హీరో మనసులా ప్రశాంతంగా వుంటుంది. మునుపెన్నడూ చూడని అందాలను తెరమీద చూపిస్తానని కొరటాల శివ ప్రమాణం చేసారు.
మిర్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికే ఈసారి కూడా కొరటాల శివ ఓటు వేసారు. ఈ చిత్రాన్ని అనుకున్న గడువులో పూర్తిచేసి వచ్చేఏడాది మహేష్ అభిమానులకు వేసవి కానుకగా ఇవ్వనున్నారు. ఈ చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటుంది.

Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.