0
నందమూరి వంశానికి పెట్టని గోడలు బాలకృష్ణ, ఎన్టీఆర్. నందమూరి కాంపౌండ్ లో ప్రస్తుతం వాళ్లిద్దరే తిరుగులేని స్టార్స్. యంగ్ టైగర్ పూర్తిగా సినిమాల మీదే ఉంటే, బాలయ్య మాత్రం అటు పాలిటిక్స్, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకరు సక్సెస్ జోరుమీదున్నారు. మరొకరు సక్సెస్ కోసం ఆకలిగొన్న పులిలా ఎదురుచూస్తున్నారు. 

లెజెండ్ సక్సెస్ తో బాలయ్యలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పాతికేళ్ల కుర్రాడిలా సెట్స్ లో కనిపిస్తున్నారు. ఒకటే ఉరుకులు-పరుగులు. పైగా ప్రస్తుతం చేస్తున్న సినిమా స్టోరీ కూడా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు పర్ ఫెక్ట్ గా సూటయ్యే కథ కావడంతో విజయంపై రెట్టింపు నమ్మకంతో ఉన్నాడు నటసింహం. ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి చేస్తున్న ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు బాలయ్య. అందుకు తగ్గట్టే సత్యదేవ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది నయా మూవీ. లెజెండ్ ఊపుమీదున్న బాలయ్య ఈ సినిమాతో లెజెండ్, సింహాలను మించిన హిట్ కొడతారని నందమూరి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. 

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాపై కూడా అభిమానుల చూపు పడింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఏదో మేజిక్ చేయబోతున్నాడని టోటల్ ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఆ ఇంట్రెస్ట్ కు తగ్గట్టే సినిమాకి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వకుండా సీక్రెట్ గా మూవీ షూటింగ్ ని క్లైమాక్స్ కు తీసుకొస్తున్నారు. యమదొంగ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు తారక్ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే స్టోరీలైన్ దొరికిందని ఇన్ సైడ్ టాక్. మరోవైపు పూరి కూడా ఈసారి తొందర పడకుండా పక్కాగా సినిమాని తెరకెక్కిస్తున్నాడట. దీంతో అటు బాబాయ్.. ఇటు అబ్బాయ్ సినిమాలపై ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్నంటాయి.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top